కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగిన విషయం తెలిసిందే. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
అయితే ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం తగ్గక పోవడంతో మళ్లీ ఆన్లైన్ క్లాసులే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఆ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో 8, 9, 10 తరగతులకు క్లాసులు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
వచ్చే నెల వరకు కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలంగా మారితే వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
కరోనా అదుపులోకి వస్తే వచ్చే నెల జూలైలో రోజు విడిచి రోజు పాఠశాలలు నడపాలన్నది సర్కర్ నిర్ణయంగా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఈ మేరకు స్కూళ్లను సిద్ధం చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
కరోనా తగ్గుముఖం పడితే వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రోజు విడిచి రోజు స్కూళ్లను నడపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)