Telangana Police Jobs: పోలీస్ ఉద్యోగాల భర్తీకి జోరుగా సాగుతున్న కసరస్తు.. ఆ ఏర్పాట్లను ప్రారంభించిన అధికారులు.. వివరాలివే
Telangana Police Jobs: పోలీస్ ఉద్యోగాల భర్తీకి జోరుగా సాగుతున్న కసరస్తు.. ఆ ఏర్పాట్లను ప్రారంభించిన అధికారులు.. వివరాలివే
Telangana Government Jobs: తెలంగాణ సర్కార్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. దాదాపు 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సర్కార్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. దాదాపు 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2/ 7
అయితే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఎంపికైన వారికి శిక్షణ అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే అధికారులు దృష్టి సారించారు.
3/ 7
గత నోటిఫికేషన్ సమయంలో మైదానాల కొరత ఏర్పడింది. ఉద్యోగానికి ఎంపికైన 4 వేల మంది TSSP కానిస్టేబుళ్ల శిక్షణకు ఆలస్యం ఏర్పడింది.
4/ 7
అయితే ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు ప్రారంభించారు.
5/ 7
ఎంపికైన అభ్యర్థులందరికీ ఒకే సారి శిక్షణ ఇచ్చేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఏపీ వైపే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
6/ 7
అభ్యర్థుల తుది ఎంపిక పూర్తయ్యే నాటికి వారికి శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు.
7/ 7
శిక్షణకు మైదానాలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని అధికారులు యోచిస్తున్నారు.