1. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం విడుదలయ్యాయి. గతంలో 10 జిల్లాల వారీగా నియమించినవారిని ఇప్పుడు 33 జిల్లాలకు సర్దుబాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలన్నీ 10 జిల్లాల ప్రకారమే జరిగాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇకపై భర్తీ చేసే పోస్టులకు 33 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకోనుంది ప్రభుత్వం. అయితే అంతకన్నా ముందే ఇప్పటికే ఉన్న ఉద్యోగులను 33 జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి. 2016 నుంచి 2019 మధ్య కొత్త జిల్లాలు ఏర్పడటంతో జిల్లాల సంఖ్య 33 కి చేరుకుంది. ఉద్యోగులకు తమ సొంత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఉద్యోగులు కొత్త జోనల్ విధానంతో జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ వారీగా బదిలీ కానున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగుల్లో సందేహాలు నెలకొంటున్నాయి. గతంలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతీ జిల్లాకు 1000 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కానీ... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే 33 జిల్లాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఖాళీగా ఉన్న పోస్టులు పాత ఉద్యోగులతోనే నిండిపోతాయి. మరి ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఎలా భర్తీ చేస్తారన్న సందేహం నెలకొంటోంది. అయితే ప్రస్తుతం ఒక చోట నుంచి మరోచోటికి వెళ్లినా ఖాళీలు ఏర్పడతాయి. ఈ సర్దుబాటు ప్రక్రియ పూర్తైన తర్వాత ఖాళీలపై ఓ క్లారిటీ రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీలను లెక్కించి తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) దగ్గర సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారని అంచనా. వారితో పాటు రిజిస్ట్రేషన్ చేయనివారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)