తెలంగాణలోని సీఎం కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఇటీవల రాష్ట్రంలో మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో మొత్తం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మిగతా ప్రాంతాల్లో 13 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
తాజాగా ఆయా కాలేజీల్లో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో 2,135 మంది, నర్సింగ్ కాలేజీల్లో 900 మందిని నియమకాలకు సంబంధించి ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఏడు మెడికల్ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 305 చొప్పున మొత్తం 2,135 మందిని నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 నర్సింగ్ కాలేజీలతో పాటు, ప్రస్తుతం ఉన్న మరో రెండు కాలేజీల్లో 60 మంది చొప్పున మొత్తం 900 నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలతో కలిపి మొత్తం 3,035 మందిని నియమించనున్నారు. అయితే.. ఈ నియామకాలను ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు. నూతనంగా నియామకమైన వారి సేవలను 2022 మార్చి చివరి వరకు వినియోగించుకోనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ నియమకాల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)