తెలంగాణలోని (Telangana) నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ స్టేట్ (NATIONAL HEALTH MISSION, TELANGANA STATE) నుంచి పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేశారు. డేటా మేనేజర్స్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 31 మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఖాళీలు, విద్యార్హతల వివరాలు: డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (District Data Manager-DDM): ఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి. బీఈ/బీటెక్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్)/ఎంసీఏ/ఎంఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఐటీ అప్లికేషన్స్ లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేలను పారితోషికంగా చెల్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ (District Accounts Manager): ఈ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఎంబీఏ(ఫైనాన్స్)/ఎం.కామ్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ ఫైనాన్స్ లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25 వేల పారితోషకం చెల్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎంపిక ఇలా: అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో మెరిట్, అనుభవం, పర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. క్వాలిఫికేషన్ కు 50 మార్కులు, అనుభవానికి 25, ఇంటర్వ్యూలకు మరో 25 మార్కులు ఉంటాయి. ఈ మొత్తం 100 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)