తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ మేరకు 30 వేల ఖాళీలకు సంబంధించి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగలంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల అవుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ సారి భారీగా కొలువుల జాతరకు సిద్ధమైన ప్రభుత్వం మంచి రోజు చూసుకుని నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన తొలి నోటిఫికేషన్ విడుదల చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే.. ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన జాబ్స్ కు సంబంధించి అత్యధికంగా పోలీస్ శాఖలో 16,587 పోస్టులు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
పోలీస్ శాఖ కూడా ఈ ఖాళీల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామకాలను చేపట్టే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే.. సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చెబుతోంది. అయితే.. ఉగాది రోజు ఈ నోటిఫికేషన్ రావడం ఖాయమని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)