తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలోనే 2 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పదిహేను యూనివర్సిటీల బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లు ను రూపొందించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అయితే.. ఈ బిల్లుపై గవర్నర్ సందేహాలను వ్యక్తం చేయడంతో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు గవర్నర్ ను కలిసి సందేహాలను నివృత్తి చేశారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)