తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ సర్కార్ గత కొన్ని రోజులుగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన అనంతరం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే.. తాజాగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా ఆ లోపు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉండాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు శాఖాల వారీగా ఖాళీలను లెక్కగట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 70 వేల వరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)