సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన మేరకు.. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అయితే.. సీఎం ప్రకటన చేసి పది రోజులవుతున్నా ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్ల విడుదల ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.