తెలంగాణలో ఐఐఐటీలో ప్రవేశాలపై అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలీసెట్-2021 ద్వారా బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయుకేటీ-ట్రిపుల్ ఐటీ)లో ప్రవేశాలకు పాలిసెట్ ను అర్హత పరీక్షగా నిర్వహించారు.
2/ 5
ఈ మేరకు యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ రాహుల్ బొజ్జా ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు లేఖ అందించారు. ఆర్జీయూకేటీలో అడ్మిషన్ కావాలనుకుంటున్న విద్యార్థులు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటన విడుదల చేశారు.
3/ 5
ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 18 నుంచి 25 వరకు పొడిగించవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు రూ. 100 లేట్ ఫీజుతో జూన్ 27 వరకు, రూ. 300 లేట్ ఫీజుతో ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
4/ 5
అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సైతం ఆర్జీయూకేటీలోని 15 శాతం సీట్లుకు పోటీ పడే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు పాలిసెట్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. యూనివర్సిటీలో మొత్తం 1500 సీట్లు ఉన్నాయి.