Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు.. వివరాలివే
Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు.. వివరాలివే
Telangana Model School admissions: తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీని అధికారులు మరో సారి పొడిగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వివిధ పరీక్షలను అధికారులు రద్దు చేస్తున్నారు. మరికొన్నింటిని వాయిదా వేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు తేదీలను సైతం అధికారులు పొడిగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తాజాగా తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీని అధికారులు మరో సారి పొడిగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తుకు ఆఖరి తేదీగా ఏప్రిల్ 30గా నిర్ణయించారు. అనంతరం మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఆఖరి తేదీని పొడిగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే.. తాజాగా మరో సారి అప్లికేషన్లకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
విద్యార్థులు పూర్తి వివరాలకు https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)