TELANGANA GOVERNMENT MAY TAKE KEY DECISION OVER AGE RELAXATION TO GOVERNMENT JOBS SOON NS
Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. అతి త్వరలోనే ఆ కీలక ఉత్తర్వులు?
తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులకు ఊరట కలిగే నిర్ణయాన్ని తీసుకునేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రంగం సిద్ధమవుతోంది. అయితే ఏళ్లుగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఊరట కలిగిలా నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భవిస్తున్నట్లు తెలుస్తోంది.(సీఎం కేసీఆర్-ఫైల్ ఫొటో)
2/ 9
ఈ నేపథ్యంలో అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
అనేక మంది నిరుద్యోగులకు ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ వయోపరిమితిని పెంచే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో జనరల్, ఇతర కేటగిరీల అభ్యర్థుల్లోనూ ఆశలు చిగురించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
50 వేల ఉద్యోగాలకు మరో రెండు నెలల్లో ఒకే సారి నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు. అప్పటి కంటే ముందుగానే సాధ్యమైనంత త్వరగా గరిష్ట వయోపరిమితికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ శాఖల్లోని పోస్టుల మినహా శారీరక దృఢత్వం అవసరమైన అన్ని శాఖల్లోని ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి పొడిగింపును సర్కార్ వర్తింపజేయనుందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
TSPSCతో సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఈ పొడిగింపు వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ప్రత్యక్ష నియామకాల విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు తాత్కాలికంగా ఏడాది కాలం పాటు పొడిగిస్తూ 2015, జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ ఉత్తర్వుల అమలు గడువును మరో రెండు సార్లు సర్కార్ పొడిగించింది. అయితే 2019, జూలై 26తో ఈ ఉత్తర్వుల గడువు ముగిసింది.(ప్రతీకాత్మక చిత్రం)