Telanana Tenth, Inter Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల రద్దుపై తాజా అప్ డేట్ ఇదే..
Telanana Tenth, Inter Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల రద్దుపై తాజా అప్ డేట్ ఇదే..
కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది కూడా రద్దు అవుతాయంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ రోజు తాజాగా 2,157 కరోనా కేసులు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వివిధ బోర్డుల వార్షిక పరీక్షలు రద్దు అవుతాయన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ రోజు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయడంతో రాష్ట్రంలోనూ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు సమాచారం. ఆయా పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అన్న సందిగ్ధంలోనే ఇంకా సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అయితే.. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇదిలా ఉంటే.. అధికారులు మాత్రం కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వస్తే తప్పా ఏర్పాట్లు ఆగవని వారు స్పష్టం చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
విద్యార్థులు కూడా ఊహాగానాలు నమ్మకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)