TSPSC Leak-Inter Exams: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో సర్కార్ అలర్ట్.. నేటి ఇంటర్ ఎగ్జామ్స్ పై కీలక ఆదేశాలు.. వివరాలివే
TSPSC Leak-Inter Exams: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో సర్కార్ అలర్ట్.. నేటి ఇంటర్ ఎగ్జామ్స్ పై కీలక ఆదేశాలు.. వివరాలివే
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడడంతో ఇంటర్ బోర్డు అప్రమత్తమైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా చూడాలని ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
2/ 8
కొన్ని నెలల నుంచి ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సారి ఎగ్జామ్స్ నిర్వహణలో అత్యంత అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సైతం హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం.
3/ 8
దీంతో పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జిల్లాల కలెక్టర్లకు, అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
4/ 8
డేటా ట్యాంపరింగ్ జరిగిందని ఇంటర్ బోర్డ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షలను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డులోని కొందరి సెల్ ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
5/ 8
ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డులోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల నిర్వాహణలో అవాంతరాలు కలిగించే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
6/ 8
దీంతో ఎగ్జామ్ పేపర్లను సెంటర్లకు పంపించే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు ఉన్నతాధికారులు. ఇంకా.. సీసీ కెమెరాల ముందే ఎగ్జామ్ పేపర్లను ఓపెన్ చేయాలని స్పష్టం చేశారు.
7/ 8
ఇంకా విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను సేఫ్ గా చేర్చే వారు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
8/ 8
ఇంకా విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను సేఫ్ గా చేర్చే వారు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.