ఇదిలా ఉంటే.. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 3.79 లక్షల మంది విద్యార్థులతో ఎన్సీఈఆర్టీ ఇటీవల సర్వే నిర్వహించింది. ఇందులో 73 శాతం విద్యార్థులు తమ స్కూల్ లైఫ్ లో సంతృప్తిగా ఉండగా, 45 శాతం మంది తమ శారీరక ఆకృతి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 29 శాతం మంది పాఠశాల విద్యార్థులకు శ్రద్ధ అనేది లేకపోగా, 43 శాతం మంది 6 నుంచి 12 తరగతి వారికి తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే సామర్థ్యం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)