విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషు మీడియం (English medium)లో బోధన కోసం టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ (cabinet) నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒక్కే సబ్జెక్టుకు రెండు బుక్స్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. టర్మ్ 1ను ఒక బుక్, టర్మ్ 2కు మరో బుక్ పంపిణీ చేయనున్నారు. ఇంగ్లిష్ మీడియం తీసుకువస్తుండడంతో ఒకే బుక్ తెలుగు, ఇంగ్లిష్ లో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, ఒకే బుక్ రెండు భాషల్లోఉంటే పుస్తకాల బరువు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థుల ఆరోగ్యం పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేఫథ్యంలో సిలబస్ ను రెండు బాగాలుగా చేసి.. ఒక్కో బాగాన్ని ఓ బుక్ లో ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే లాంగ్వేజ్ పుస్తకాలకు ఒకే పుస్తకం ఉండనుంది. మాథ్స్, సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్టులకు మాత్రమే రెండు పుస్తకాలు అందించనున్నారు. త్వరలోనే ఈ మేరకు ప్రింటింగ్ కూడా ప్రారంభించనుంది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పరిపాలనా సంస్కరణల కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.