తెలంగాణ జాబ్స్, తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ గ్రూప్స్ జాబ్స్" width="1200" height="1200" /> తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల (Telangana Group 1 Jobs) భర్తీకి TSPSC నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ (TSPSC Notification) కూడా విడుదల కాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒకే సారి 503 ఉద్యోగాల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంత మొత్తంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఇంత పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల కాలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ప్రత్యేక పేపర్ ను నియామక పరీక్షల్లో చేర్చారు. గ్రూప్ 1 కు సంబంధించి సైతం ఈ పేపర్ ను యాడ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన ఘట్టాలపై మంచి అవగాహన ఉంటే ఈ పేపర్ లో మంచి మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పంది, తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, పార్టీ ఆవిర్భావం, ఉప ఎన్నికలు, దీక్ష, జేఏసీ ఏర్పాటు సకల జనుల సమ్మె గురించి తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా స్వరాష్ట్రం కోసం పదవులకు రాజీ నామాలు చేసిన నేతల వివరాలు, చిదంబరం ప్రకటన, శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు, కమిటీ నివేదిక, వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం, పార్లమెంట్ లో బిల్లు అనంతర పరిణామాల గురించి తెలుసుకోవాలి. ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, కవులు, కళాకారుల పాత్ర, అత్యంత ప్రాచురణ పొందిన తెలంగాణ ఉద్యమ పాటలు గురించి కూడా తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా తెలంగాణ అమరవీరుల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వివరాల గురించి తెలుసుకుంటే ఈ పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రణాళిక బద్ధంగా, క్రమ పద్ధతిలో చదివితే ఈ పేపర్లో అధిక స్కోర్ రాబట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. T-SATలో సైతం TELANGANA MOVEMENTకు సంబంధించి పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)