తెలంగాణలో కొలువుల జాతర (Telangana Jobs) మొదలైంది. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే వరుసగా ఇందుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేయనున్నారు అధికారులు. అయితే అత్యధికంగా పోటీ ఉండే జాబ్స్ లలో గ్రూప్ 2 ఉద్యోగాలు ఒకటి.
గ్రూప్ 2 ఎగ్జామ్ లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి.. పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కి సంబంధించి 150 మార్కులుగ్రూప్ 2 ఎగ్జామ్ లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి.. పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కి సంబంధించి 150 మార్కులు ఉంటాయి. పేపర్ II కు సంబంధించి చరిత్ర, రాజకీయాలు, సమాజం 3 x 50=150 మార్కులకు ఉంటాయి.
గ్రూప్ I, గ్రూప్ II ప్రిలిమ్స్, గ్రూప్ III, గ్రూప్ IV సర్వీసెస్‌లో పేపర్ I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సిలబస్ అన్నింటికీ కామన్‌గా ఉంటుంది. అయితే సర్వీస్ స్థాయిని బట్టి సబ్జెక్ట్ వెయిటేజీ మారుతుంది. ఉదాహరణకి తెలంగాణ ఏర్పాటుకు గ్రూప్ I, గ్రూప్ IIలో 150 మార్కులు కేటాయించారు. అయితే, గ్రూప్ IIIలో దీనికి 50 మార్కుల వెయిటేజీ మాత్రమే ఉంటుంది. గ్రూప్ IV పేపర్ Iలో జనరల్ స్టడీస్‌కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది.