తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1,460 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టులను ఐదు రోజుల కింద రద్దు చేసిన ప్రభుత్వం.. శుక్రవారం 3,977 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల ద్వారా నియామకమైన అభ్యర్థులు వచ్చే సంవత్సరం మార్చి 31 కొనసాగేలా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేయాలని సూచించింది.
జీఓఆర్టీ నం.1040 ప్రకారం 766 స్పెషల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, 115 సివిల్ సర్జన్ (జనరల్), 139 ల్యాబ్ టెక్నీషియన్, 119 ఫార్మసిస్టు, 252 ఏఎన్ఎం పోస్టు లు, జీఓఆర్టీ 1039 ద్వారా 264 సివిల్ సర్జన్, 86 ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–2, 126 ఫార్మసిస్టు గ్రేడ్–2 పోస్టులు మంజూరు చేశారు. ప్రతీకాత్మక చిత్రం