విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలస్తే.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1393, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 92, టెక్నికల్ అసిస్టెంట్ 32, Zoo Attendent - NZP విభాగంలో 9, అసిస్టెంట్ కన్సెర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ 18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 14, జూనియర్ అసిస్టెంట్ (LC), జూనియర్ అసిస్టెంట్ (HO), అసిస్టెంట్ ప్రొఫెసర్ - FCRI 21 ఖాళీలు ఉన్నాయి.
మొత్తం 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మార్చిలో 30,453 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి అనుమతులు ఇవ్వనున్నారు.