TSRJC-CET 2021: పది పాసైన తెలంగాణ విద్యార్థులకు గమనిక.. గురుకుల ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
TSRJC-CET 2021: పది పాసైన తెలంగాణ విద్యార్థులకు గమనిక.. గురుకుల ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
TSRJC-CET 2021: తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులను సమర్పించడానికి గడువును పెంచారు. ఏప్రిల్ 1 న మొదలైన ఈ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుండగా దాన్ని మే 17 వరకు పొడిగించారు.
TSRJC-CET 2021 తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అడ్మిషన్ల గడువును అధికారులు పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
రాష్ట్రంలోని 35 కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
విద్యార్థులు tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దీనికి సంబంధించి మే 28న ఉదయం 10 నుంచి 12.30 వరకు అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
దరఖాస్తును సమర్పించే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 040-23120306 , 040-23120307 లేదా 040-24734899 , 8008904486 లను సంప్రదించవచ్చన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఫోన్ చేసేవారు వర్కింగ్ సమయంలో అంటే ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే సంప్రదించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)