ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అంశంపై చర్చ జరిగింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అయితే కరోనా నేపథ్యంలో పరీక్షల రద్దుకే మంత్రివర్గం మొగ్గుచూపింది. ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహిండం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని అధికారులు మంత్రి వర్గం దృష్టికి తీసుకువచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అయితే ఈ అంశంపై ఈ రోజు సాయంత్రం అధికారులు కీలక ప్రకటన చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
పరీక్షల రద్దుతో పాటు విద్యార్థులకు మార్కుల కేటాయింపుకు అవలంభించనున్న విధానంపై కూడా ప్రకటనలో వివరించానున్నారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేయడంతో పాటు ఫలితాలను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)