పరీక్షల సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి ప్రతీ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులు నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.