తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 80 వేల ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో ఇప్పటికే 30 వేల ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతులు కూడా లభించాయి. దీంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్లు విడుదల అవకాశం ఉంది. (మంత్రి సబితారెడ్డి-ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం కోచింగ్ సెంటర్లకు నిరుద్యోగులు బారులుదీరడంతో వారు భారీగా ఫీజులు పెంచేశారు. దీంతో ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సబితారెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం 100 లైబ్రరీల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ ను పూర్తిగా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ సారి భారీగా కొలువుల జాతరకు సిద్ధమైన ప్రభుత్వం మంచి రోజు చూసుకుని నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన తొలి నోటిఫికేషన్ విడుదల చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే.. ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన జాబ్స్ కు సంబంధించి అత్యధికంగా పోలీస్ శాఖలో 16,587 పోస్టులు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
పోలీస్ శాఖ కూడా ఈ ఖాళీల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామకాలను చేపట్టే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే.. సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చెబుతోంది. అయితే.. ఉగాది రోజు ఈ నోటిఫికేషన్ రావడం ఖాయమని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)