TS Tenth Exams Hall Tickets: తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ డైరెక్ట్ లింక్ ఇదే!
TS Tenth Exams Hall Tickets: తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లను అధికారులు తాజాగా విడుదల చేశారు. విద్యార్థులు https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ హాల్ టికెట్ పై హెచ్ఎం సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఫీజుల కోసం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు గతంలో హాల్ టికెట్లను ఇవ్వకుండా విద్యార్థులును వేధించేవారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ స్కూళ్లకు సంబంధం లేకుండా.. నేరుగా ఆన్లైన్లోనే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం మొత్తం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
హాల్ టికెట్లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే? - విద్యార్థులు మొదటగా https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి - అనంతరం హోం పేజీలో కనిపించే SSC Public Examinations April 2023 - Hall Tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కనిపించే Regular Hall Tickets Download ఆప్షన్ పై క్లిక్ చేయాలి. - తర్వాత వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)