కరోనా ప్రభావం అత్యధికంగా పడిన రంగాల్లో విద్యారంగం ఒకటి. ఈ మహమ్మారి కారణంగా గతేడాది నుంచి తరగతులు, పరీక్షలు అంతా గందరగోళంగా మారాయి.(ప్రతీకాత్మక చిత్రం) అయితే.. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో తరగతులను తిరిగి ప్రారంభించడానికి దేశ వ్యాప్తంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే తెలంగాణ రాష్ట్రంలోనూ విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) ఈమేరకు ఇటీవల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం) రాష్ట్రంలో ఆగస్టు 15 తర్వాత దశలవారీగా తరగతులను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ తన నివేదికలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం) అయితే.. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ఈ నివేదికను సర్కార్ కు సమర్పించినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం) కానీ, మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ నెలలోనే తరగతులను ప్రారంభించడానికి ఆయా రాష్ట్రాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) ఆయా రాష్ట్రాల్లో తరగతులను ప్రారంభిస్తే తెలంగాణలోనూ త్వరలోనే స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)