TELANGANA EDUCATION DEPARTMENT OFFICIALS MAY TAKE KEY DECISION OVER TENTH EXAM RESULTS IN ONE OR TWO DAYS NS
Telangana Tenth Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. మార్కుల కేటాయింపు ఎలా?
తెలంగాణలో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న అంశం ఇంకా ఫైనల్ కాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ ను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ బోర్డు టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే.. ఫలితాల విషయంలో సీబీఎస్ఈ బోర్డు అవలంభించే విధానాన్నే తాము ఆచరిస్తామని ఆ సమయంలో అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
సీబీఎస్ఈ నిన్న ఫలితాల వెల్లడిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ సబ్జెక్టులో ఇంటర్నల్స్ కు 20 మార్కులతో పాటు మిగతా 80 మార్కులను ఈ ఏడాది పాటు నిర్వహించిన వివిధ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభకు కేటాయించాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే.. తెలంగాణలో ఈ విధానాన్ని అనుసరించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 44 రోజులు మాత్రమే ప్రత్యక్ష తరగతులను నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇందులో కేవలం ఓకే ఒక పరీక్ష(FA) ను నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో పది విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న విషయం మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అయితే ఈ విషయంపై అధికారులు చర్చించి ఓ విధానాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
జూన్ 20న సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడదుల కానున్నాయి. తెలంగాణలోనూ జూన్ చివరి నాటిపి ఫలితాలను విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)