TELANGANA EDUCATION DEPARTMENT OFFICIALS ANNOUNCED SUMMER HOLIDAYS DATES HERE DETAILS NS
TS Schools Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?
Telangana Schools Summer Holidays: తెలంగాణ విద్యాశాఖ అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. సమ్మర్ హాలీ డేస్ ను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ విద్యాశాఖ అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. సమ్మర్ హాలీ డేస్ ను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23 వ తేదీ లాస్ట్ వర్కింగ్ డేగా నిర్ణయించినట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 16 వరకు 1-9వ తరగతి విద్యార్థుల పరీక్షల పేపర్లను మూల్యాంకనం చేయనున్నట్లు గతంలో వెల్లడించిన అధికారులు తాజాగా ఆ తేదీలను మార్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నెల 16 నుంచి 22 వరకు మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ పరీక్ష ఫలితాలను 23న ప్రకటించన్నారు. అదే రోజును ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూలు సమయాలను తగ్గించాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
మొన్నటి వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్క పూట స్కూళ్లు కొనసాగుతుండగా.. మొన్నటి నుంచి తగ్గించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పని చేస్తాయని వెల్లడించారు. ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 వరకే స్కూళ్లను నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)