కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగా జరగక, సిలబస్ సరిగా పూర్తి కాక విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 7
టెన్త్ విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ లో 50 శాతం చాయిస్ ఇవ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే థియరీ ప్రశ్నలకు మాత్రమే ఈ 50 శాతం చాయిస్ విధానం వర్తించనుంది. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
3/ 7
ఇదిలా ఉంటే ఉప్పటికే పరీక్ష పేపర్లను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6 సబ్జెక్టులకు గాను 11 పేపర్లతో పరీక్షలను నిర్వహించే వారు. హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున పరీక్షలను నిర్వహించేవారు.
4/ 7
అయితే కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా ఈ సారి ఆ ఐదు సబ్జెక్టులకు సైతం ఒక్కో పేపర్ చొప్పున ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ సారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
5/ 7
ఇప్పటికే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో ప్రభుత్వం ఎగ్జామ్స్ ను రద్దు చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి పాస్ చేసి, పై తరగతులకు ప్రమోట్ చేశారు.
6/ 7
అయితే విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ ఏడాది ఎలాగైనా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ షెడ్యూల్ ను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్స్ మే 11న ప్రారంభం కానున్నాయి.
7/ 7
విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏడాది కూడా 70 శాతం సిలబస్ తో నే ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.