తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో అధికారులు పలు మార్పులు చేశారు. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్, టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు భారీగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు మొత్తం 1.80 లక్షలకు పైగా విద్యార్థులు అప్లై చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10 వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 1.80 లక్షల దరఖాస్తుల్లో ఇంజనీరింగ్ కు సంబంధించి 1,14,989, అగ్రికల్చర్ విభాగంలో 65,033 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)