తెలంగాణలో మొత్తం 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు సైతం మొదలైంది. మొత్తం 9,168 గ్రూప్ 4 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో గ్రూప్ - 4 పోస్టుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రూప్-4 కు సంబంధించి 9,168 పోస్టుల భర్తీపై చర్చించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీ లోపు ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీకి పంపించాలని సూచించారు. వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు అందగానే ప్రభుత్వ అనుమతితో గ్రూప్ 4కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లను ప్రారంభంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
పోలీస్ జాబ్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నవి గ్రూప్-4 ఖాళీలే. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ సైతం సాగిస్తున్నారు. వారంతా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా.. గ్రూప్-2కు సంబంధించి 582 పోస్టులు, గ్రూప్-3కి సంబంధించి 1373 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ రెండింటికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే కూడా.. ఈ రెండు గ్రూపుల్లోని పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ అంశంపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు రేపు అంటే మే 20 లాస్ట్ డేట్. ఇంకా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్ - 1 నోటిఫికేషన్ ను సైతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సైతందరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)