TELANGANA BC CIRCLE OFFERS FREE COACHING FOR SI AND CONSTABLE JOB ASPIRANTS AND RELEASED TSBCESDTC APP NS
Telangana Police Jobs: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ కోసం యాప్.. వివరాలివే..
Free Coaching For Telangana Police Jobs: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్(Telangana BC Study Circle) శుభవార్త చెప్పింది. గతంలో ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తులు స్వీకరించిన స్టడీ సర్కిల్ తాజాగా వారి కోసం యాప్ రూపొందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అందులో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉండనున్నాయి. దీంతో అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు కొన్ని రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఈ ఉచిత కోచింగ్ కోసం అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఆ అభ్యర్థులకు బీసీ కార్పొరేషన్ అధికారులు తాజాగా కీలక సూచన చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి టీఎస్బీసీఈఎస్డీటీసీ(TSBCESDTC) యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అభ్యర్థులకు ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ తెలిపింది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇతర వివరాలకు 24071178, 6302427521 నంబర్లకు సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాప్ ను చాలా యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సులువుగా వినియోగించుకునేలా దీనిని తయారు చేశామన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)