తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(TSACS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్, కౌన్సెలర్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, కేర్ కోఆర్డినేటర్, న్యూట్రిషనిస్ట్, రిసెర్చ్ ఫెలో తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగాల్లో ఇంటర్, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, ఎండీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అభ్యర్థులను రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
దరఖాస్తులను సంబంధిత జిల్లా కేంద్రాల్లోని మెడికల్ సూపరింటెండెంట్/డైరెక్టర్ కార్యాలయాల్లో అందించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
దరఖాస్తులను అందించడానికి ఆగస్టు 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://tsacs.telangana.gov.in/ లింక్ ను సందర్శించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)