1. తెలంగాణలోని అంగన్వాడీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జిల్లాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 57 ఖాళీలు, సంగారెడ్డి జిల్లాలో 43 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 25 చివరి తేదీ కాగా, సంగారెడ్డి జిల్లాలో పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 27 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. స్థానికంగా నివసించేవారు మాత్రమే అప్లై చేయాలి. పెళ్లైన మహిళలు మాత్రమే అప్లై చేయాలి. స్థానిక గ్రామపంచాయతీలో నివసించేవారికే అవకాశం. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)