TELANGAN EAMCET HALLTICKETS AVAILABLE FROM TODAY TO JULY 31 FULL DETAILS HERE VB
Entrance Exam 2021: విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు వచ్చేశాయి.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
TS Eamcet: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-2021) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
తెలంగాణ ఎంసెట్ అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు eamcet.tsche.ac.in వెబ్ సైట్ నుండి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
బిట్ శాట్, ఎంసెట్ పరీక్ష ఒకే రోజు ఉన్న అభ్యర్థులు ముందుగా సమాచారం ఇస్తే వాళ్లకు మరో రోజు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇదిలా ఉండగా..ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌కు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మాకు 85,828 దరఖాస్తులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కాగా రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇంజనీరింగ్ విభాగానికి ఆగస్టు 4 నుంచి 6 తేదీలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అదే అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ కోసం ఆగస్టు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అన్ని కేటగిరీల్లో ఎంసెట్ పరీక్ష ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
పూర్తి వివరాలకు eamcet.tsche.ac.in ను సందర్శించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)