Tech Mahindra: టెక్ మహింద్రాలో 3 వేల ఉద్యోగాలు.. భయపెడుతున్న నివేదికలు..
Tech Mahindra: టెక్ మహింద్రాలో 3 వేల ఉద్యోగాలు.. భయపెడుతున్న నివేదికలు..
దేశంలోని ఐదవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సేవల ఎగుమతిదారు టెక్ మహీంద్రా, వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
దేశంలోని ఐదవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సేవల ఎగుమతిదారు టెక్ మహీంద్రా, వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
రాష్ట్రవ్యాప్తంగా తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ఐటి/ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్) విధానంలో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. దీనితోపాటు రానున్న ఐదేళ్లలో యువతకు ఉపాధి కల్పించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. “ఈ ఎమ్ఓయూ (గుజరాత్ ప్రభుత్వంతో) రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం సృష్టించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడటమే కాకుండా.. ప్రతిభను పెంపొందించడంలో ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దీని వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆగస్టు 2022లో.. ఐటి కంపెనీలు గత సంవత్సరం కంటే జాబ్ రిక్రూట్ మెంట్ కోసం 10 శాతం కంటే తక్కువగా ప్రకటనలు విడుదల చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
జాబ్ పోర్టల్ Naukri.com ప్రకారం, గత 20 నెలల్లో మొదటిసారిగా, వార్షిక ప్రాతిపదికన ఐటీ రంగ కంపెనీల జాబ్ పోస్టింగ్లు తగ్గాయి. ఇదొక్కటే కాదు, ఐటి రంగంలో ఉద్యోగాలు వదిలేసే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గ్లోబల్ ఎకానమీలో మందగమనం జరుగుతుందన్న భయంతో ఇది జరుగుతోంది. సెప్టెంబర్లో ఐటీ సేవలు, సాఫ్ట్వేర్ సేవల రంగాలు వరుసగా 13 శాతం, 42 శాతం క్షీణతను నమోదు చేశాయని ఎక్స్ఫెనో నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఐటీ రంగం కష్టకాలంలో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం, స్టాఫింగ్ మరియు రీసెర్చ్ సంస్థ ఎక్స్ఫెనో ఒక నివేదికలో భారతదేశంలో ఐటి రంగంలో క్రియాశీల ఉద్యోగాల సంఖ్య ఆగస్టులో 260,000 నుండి సెప్టెంబర్లో 210,000కి తగ్గిందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)