ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇప్పటికిప్పుడు ఆఫీసులకు వచ్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. దీంతో దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు ఎక్కడి నుండి అయినా పని చేయడానికి హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రాబోయే రోజుల్లో హైబ్రిడ్ మోడల్ వర్క్ ఎలా ఉండబోతుందనే దానిపై వివరణ ఇచ్చింది. ‘టూ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఫ్రం ఎనీవేర్’ అనే నినాదంతో 3E మోడల్ (ఎంబ్రేస్, ఎనేబుల్, ఎంపవర్) అవలంభిస్తున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ‘భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా పని చేసే సౌలభ్యంతో ఇది హైబ్రిడ్ మోడల్లో భాగం కానుంది. ఉద్యోగుల అభివృద్ధికి 3E విధానం దోహపడుతుంది.’ అని టీసీఎస్ తెలిపింది. (ఫ్రతీకాత్మక చిత్రం)
* ఎంబ్రేస్
ఇంటి నుండి పని చేసే సమయంలో ఉద్యోగానికి పూర్తి సమయం కేటాయించడం సవాల్‌తో కూడుకున్నది. ఇంటి పనులు, పిల్లల చదువు, పెంపుడు జంతువుల సంరక్షణ తదితర ఇతర బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం, ఇంటి పనుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలి. దీనికి కొంత నిర్మాణాత్మక ఆలోచనతో ఉండాలి. ప్రాధాన్యతను బట్టి పనులకు సమయం కేటాయించుకుంటే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* ఎనేబుల్
ఎక్కడ నుంచైనా పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో సంస్థలు తెలుసుకోవాలి. ముఖ్యంగా వర్క్, ఎంటర్ ట్రైన్మెంట్ల సమతుల్యతను సంస్థలు కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించడానికి, పనిలో ఆనందాన్ని తీసుకురావడానికి సంస్థలు అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)