కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఐటీ రంగంలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అన్ని సంస్థల్లోని మెజార్టీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం.. కొత్త కేసుల నమోదులో గణనీయంగా తగ్గుదల కనిపిస్తుండడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే పనిలో పడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో హైబ్రిడ్ వర్క్ మోడల్ లోకి మారుతున్నామని టీసీఎస్ తెలిపింది. ఆఫీస్, ఇంటి నుంచి పనిచేయడం వంటి రెండు మార్గాలను ప్రస్తుతానికి ఎంచుకోవచ్చని.. అయితే రాబోయే నెలల్లో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.
ఈ కొత్త పద్దతిలోని ఫ్లెక్సిబిలిటీ, స్వయంప్రతిపత్తి ద్వారా గతంలో మాదిరి ఇప్పటికిప్పుడు మార్పులు చేయలేమని TCS తన వెబ్సైట్లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌కు అనుగుణంగా ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని సంస్థ ఆశించినప్పటికీ... ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని టీసీఎస్ కొనసాగిస్తోందని కొన్ని రిపోర్ట్స్ తెలియజేశాయి. 25/25 మోడల్ ప్రకారం... టీసీఎస్ తన వర్క్‌ఫోర్స్‌లో కేవలం నాలుగో వంతు మాత్రమే కేటాయించిన సమయాల్లో ఆఫీసులకు వచ్చేలా కోరుకుంటుందని కొన్ని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
టీసీఎస్ కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్ గ్లోబల్ హెడ్ అశోక్ పాయ్ మాట్లాడుతూ... హైబ్రిడ్ వర్క్ మోడల్లో ఉద్యోగులు, సంస్థలు మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించడానికి, ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడానికి, ఉన్నతమైన వ్యాపార ఫలితాలను రాబట్టడం కోసం కాగ్నిటివ్, AI, ఇతర డిజిటల్ సాంకేతికతలను ప్రభావితం చేసే శక్తివంతమైన ఆఫీస్ మోడల్‌ను రూపొందించడంలో TCS కీలక పాత్ర పోషిస్తుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)