1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్' (Smart Hiring Program) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ద్వారా భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది టీసీఎస్. దరఖాస్తు గడువును నవంబర్ 2న ముగియడంతో నవంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ గడువు కూడా ముగుస్తుండటంతో గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆసక్తి గల అభ్యర్థులు 2021 డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక నవంబర్ 19న టెస్ట్ జరగాల్సి ఉంది. చివరి తేదీని పొడిగించడంతో ఈ టెస్ట్‌ను వాయిదా వేసింది టీసీఎస్. టెస్ట్ తేదీలను త్వరలో ప్రకటించనుంది. మరి టీసీఎస్ 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్'కు ఎవరు దరఖాస్తు చేయొచ్చు? ఏఏ అర్హతలు ఉండాలి? తెలుసుకోండి. (image: TCS)
3. బీసీఏ, బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్స్ ఇన్ వొకేషనల్ పాస్ కావాలి. 2020, 2021, 2022 లో పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ అయి, ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్థులకు టెన్త్, ఇంటర్, డిగ్రీలో 50 శాతం మార్కులు లేదా సీజీపీఏ 5 వస్తే చాలు. 2022 లో డిగ్రీ రాసిన అభ్యర్థులకు ఒక బ్యాక్లాగ్ ఉన్నా దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ నియామకాలు పూర్తయ్యేనాటికి బ్యాక్లాగ్ క్లియర్ చేయాలి. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో రాణించిన అభ్యర్థులకు టీసీఎస్ ఇగ్నైట్, టీసీఎస్ యూనిక్ సైన్స్ టు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్'కు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://www.tcs.com/careers/tcs-smart-hiring లింక్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో వివరాలన్నీ చదివి TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి. మీరు రిజిస్టర్డ్ యూజర్ అయితే 'Apply For Drive' పైన క్లిక్ చేయాలి. కొత్త యూజర్ అయితే Register Now పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి. అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి. Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయినట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
7. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేసేందుకు రెండు గంటలు (120 నిమిషాల) టెస్ట్ నిర్వహిస్తోంది టీసీఎస్. వర్బల్ ఎబిలిటీపై 24 ప్రశ్నలకు 30 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీపై 30 ప్రశ్నలకు 50 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీకి 26 ప్రశ్నలకు 40 నిమిషాల చొప్పున పరీక్ష ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)