కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం.. భారతదేశంలోని 73 శాతం ఆఫీసులు కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాలు నెమ్మదిగా వెనక్కి తగ్గుతుండటంతో, తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వకుండా.. హైబ్రిడ్ వర్కింగ్ ఏర్పాట్లను చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారి తర్వాత కంపెనీలు ప్రధానంగా సౌకర్యవంతమైన పని విధానాలను ఎంచుకుంటున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఇలా ఐటీ ఆఫీస్ లు తెరుచుకోవడంతో వర్క్ స్పేస్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో కార్యాలయం ప్రదేశ లీజుల్లో దేశంలోని అన్ని మెట్రో నగరాలు దూసుకుపోతుండగా.. ఐటీ హబ్ లు గా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్ లు ఈ రేసులో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ లో ఇటీవల రికార్డు స్థాయిలో ఆఫీసు ప్రదేశం లీజు ఒప్పందాలు జరుగుతున్నట్లు పలు కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి.
ESG సూత్రాలు ఊపందుకోవడంతో కార్యాలయానికి తిరిగి రావడానికి వేగవంతమైన వ్యూహంలో భాగంగా యజమానులు స్థిరత్వం, ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. సర్వేలో భాగమైన 52 శాతం మంది ESG-కంప్లైంట్ భవనాలను పొందడానికి, తరలించడానికి సిద్ధంగా ఉన్నారని, మరో 7 శాతం మంది ప్రీమియం అద్దెతో కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రముఖ సర్వేల ద్వారా తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)