4. నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ద్వారా లక్షలాది మంది యువతీయువకులు భారతదేశంలోని టాప్ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు మేం అవకాశం కల్పిస్తున్నాం అని టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి తెలిపారు. హైక్వాలిటీతో నిర్వహించే స్టార్డర్డైజ్డ్ టెస్ట్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అన్ని అర్హతలు ఉన్న నిపుణులను అందిస్తామన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. టీసీఎస్‌తో పాటు ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్ ఈ పరీక్ష రాయొచ్చు. 2021 లో టీసీఎస్ క్యాంపస్ హైరింగ్ మొదలుపెట్టనుంది. అందులో పాల్గొనేవారు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో క్వాలిఫై కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే కాదు, ఆయా రంగాల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఇంట్లో నుంచే ఈ పరీక్ష రాయొచ్చు. లేదా దగ్గర్లోని టీసీఎస్ అయాన్ సెంటర్లో ఎగ్జామ్ రాయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)