1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు మరో అవకాశం ఇస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండేళ్లకు పైగా అనుభవం ఉన్నవారిని నియమించుకుంటోంది. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫర్ వుమెన్ ప్రొఫెషనల్స్ (TCS Tech Hiring For Women Professionals) పేరుతో రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునేవారు లేదా పలు కారణాల వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), టీసీఎస్ కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తోంది. మొత్తం 42 రకాల పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి 2022 ఏప్రిల్ 23 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. టీసీఎస్ 42 రకాల పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో .Net Developer, .Net Full Stack, .NET/PL SQL, Angular 10+, AWS Developer, Back End Developer, Big Data Developer, DevOps Architect, Google Cloud Platform, Java Developer, Java Full Stack Developer, Java Microservices, Java Scala, Java Spring Boot, Mobile/ Smart Device Tester పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీటితో పాటు MySQL DB Administrator, Network Architect, Node JS Developer, PL/SQL, 20. Python, PL/SQL, QA Automation, React JS, Salesforce Developer, Scrum Master, Senior Talend Developer, ServiceNow Developer, Siebel Developer, Tech Lead, Technical Delivery Manager, UI Developer పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. వీటితో పాటు UI Lead, UX Designer, .NET + Angular, Automation Test Engineer, Automation Testing, Automation Testing with Selenium, Core Java Developer, Full Stack Developer, Java Developer, Java Full Stack Developer, VB .NET - Bengaluru/Chennai/Kochi, Visual Basic - CHN/IDR/KOL/HYD పోస్టులన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆసక్తి గల మహిళలు https://ibegin.tcs.com/iBegin/register వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఐటీ, బీపీఓలో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలి. మెయిల్ ఐడీ ఎంటర్, పాస్వర్డ్, పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. సంబంధిత విభాగంలో విద్యార్హతలతో పాటు రెండేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)