రెండు కంపెనీలు వరుసగా రూ. 9,926 కోట్లు, రూ. 5,686 కోట్ల లాభాలను నమోదు చేశాయి. కంపెనీలు తమ ఆదాయాలను ప్రకటిస్తూనే, వారి నియామక ప్రక్రియ(Recruitment)లు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను కూడా వివరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మంది ఉద్యోగులను తీసుకోబోతున్నారనే దానిపై కూడా అంచనాలను అందించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
విలేకరుల సమావేశంలో TCS CEO, MD రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ..‘సీనియర్ అసోసియేట్లను వారి డిప్యూటెడ్ స్థానాలకు తిరిగి రావాలని కోరుతున్నాం. సీనియర్ అసోసియేట్లు మాత్రమే ఏప్రిల్ నుంచి వారంలోని మొదటి మూడు రోజులు కార్యాలయానికి రావాలి. మా సీనియర్ అసోసియేట్లు టాప్ 50,000 మంది ఉద్యోగులతో ఈ ప్రక్రియ అమలు చేస్తున్నాం. క్రమంగా ఆఫీసులకు రావాల్సిన రోజులను మారుస్తాం.’ అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్ఫోసిస్ నియామకం
సాఫ్ట్వేర్ మేజర్ ఇన్ఫోసిస్ గురువారం తన నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. తర్వాత విలేకరుల సమావేశంలో అట్రిషన్ రేట్ల పెరుగుదల మధ్య మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ వెలుపల, క్యాంపస్లో 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు విలేకరులకు తెలియజేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ విలేకరులతో మాట్లాడుతూ..‘గత సంవత్సరంలో, మేము భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నాం. కనీసం 50,000 మందిని (ఈ సంవత్సరం) నియమించుకోవాలని యోచిస్తున్నాం. ఎలా జరుగుతుందో చూడాలి. ఇవి ప్రారంభ గణాంకాలు మాత్రమే.’ అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)