దాదాపు రెండున్నరేళ్లుగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బాగా అలవాటుపడ్డారు. ఉన్నట్టుండి ఆఫీసులకు రావాలని కంపెనీలు కోరుతున్నా.. చాలా మంది అందుకు సుముఖంగా లేరు. దీంతో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ‘హైబ్రిడ్ మోడల్’ ను అనుసరిస్తామని దేశీయ దిగ్గజ ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఇప్పటికే ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
25×25 విధానంలో ఉద్యోగులు సౌకర్యవంతంగా ఉండడానికి అకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ తెలిపింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏదైనా TCS కార్యాలయంలోని టీమ్ సభ్యులతో ఇంటరాక్ట్ కావడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుందని టీసీఎస్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
అభివృద్ధి కేంద్రాలు (DC) ఉన్న నగరాలు, వాటికి సమీపంలో ఉన్న పట్టణాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న వారు వారానికి రెండు సార్లు ఆఫీసులకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని ఆయన వెల్లడించారు. రెండో దశలో DC పట్టణాలకు దూరంలో ఉన్న ఉద్యోగులు తమ బేస్ డెవలప్మెంట్ కేంద్రాలకు తిరిగి రాగలరో లేదో పరిశీలించడానికి రాబోయే కొన్ని నెలల్లో సన్నాహాలు ప్రారంభించేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)