భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల (మే) నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను ఆదేశించింది. మొత్తం ఉద్యోగుల్లో 50వేల మందికి ఈ ఆదేశాలు జారీ చేసింది. 2023 ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి 20 శాతం ఉద్యోగులు ఆఫీసుల నుంచి మిగతా 80 శాతం ఉద్యోగులు ఇంటి నుండి పనిచేసేలా టీసీఎస్ ప్రణాళికలు రచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే పనిలో పడ్డాయి. టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం అత్యున్నత స్థాయి ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అది కూడా వారానికి 3 రోజులు మాత్రమేనని, మిగతా రెండు రోజులు ఇంటి నుండి పని చేసుకోవచ్చని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
TCS గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,03,546 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. దీంతో టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 5,92,195కి చేరింది. తాజా నిర్ణయంపై TCS సీఈవో & ఎండీ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ... ఈ నెల నుండి కంపెనీ.... సీనియర్ అసోసియేట్లకు వారానికి మూడుసార్లు కాల్ చేయడం ప్రారంభిస్తుందన్నారు. దీంతో ఎవరైతే తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు రెడీ ఉన్నారో వారి కవరేజీని నిరంతరం పెంచుతామన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోతామని... తద్వారా ఈ పద్దతి షిఫ్ట్‌కి సర్దుబాటు చేసి స్థిరమైన స్థితికి చేరుకోగలుగుతుందని గోపీనాథ్ తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 25/25 మోడల్‌పై టీసీఎస్ విశ్వాసం వ్యక్తం చేసిందని.. త్వరలోనే నిర్మాణాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలలో విస్తరించి ఉన్న అన్ని గ్లోబల్ కార్యాలయాల్లోని క్యాంపస్‌లు రాబోయే నెలల్లో యువ శక్తితో సందడిగా మారాలని ఎదురుచూస్తున్నామని టీసీఎస్ పేర్కొంది. తమ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే 25/25 మోడల్‌ను స్వీకరించడానికి కట్టుబడి ఉన్నామని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)