1. సంపాదన చాలకపోయినా అప్పు చేసైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. తమ స్తోమత చాలదు అనుకునేవారే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు చదువు సరిగ్గా రాదనే అపోహ ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంతేకాదు... ప్రభుత్వ స్కూళ్లల్లో చదివేవారు పైచదువులకు అడ్మిషన్లు తీసుకోవడం కూడా తక్కువే. ఇలాంటి పరిణామాలు గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ లాంటి కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)