ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసుకునే (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశాన్ని ఉద్యోగులందరికీ కల్పించింది. ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు సింక్రోనీ ఎస్వీపీ ఆండీ పొన్నేరి తెలిపారు. ఈ నిర్ణ యం ఉద్యోగులు, వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే నిబద్దతకు నిదర్శనమని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అందరికీ అనుకూలమైన పని వాతావరణాన్ని సైతం ప్రోత్సహిస్తున్నట్లు సింక్రోనీ బిజినెస్ లీడర్ ఇండియా ఎస్విపి ఆండీ పొన్నేరీ తెలిపారు. ఇలా శాశ్వతంగా Work From Home సదుపాయం కల్పించడం వల్ల చాలామంది నిపుణులను ఆకర్షించేందుకు వీలుటుందని అన్నారు. పని జీవితం మధ్య సమతౌల్యం దెబ్బతినకుండానే ఉద్యోగులు మంచి ఉత్పాదకతను అందించగలరని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
గత 2.5 సంవత్సరాలుగా మేము వర్క్–లైఫ్ బ్యాలెన్స్ పట్ల ఉద్యోగుల ధోరణులు, మారిన పనివాతావరణ తీరు గురించి నేర్చుకుంటూనే ఉన్నాము. మహమ్మారి నుంచి మెరుగైన అవకాశాలను వారు అంచనా వేస్తున్నారు. మా నూతన మార్గపు వర్కింగ్, సౌకర్యం, ఎంపిక వంటి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడం వంటి అవకాశాలను అందిస్తుంది.