Telangana Schools: తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్.. !
Telangana teachers: రాష్ట్రంలో కరోనా కోరలుచాస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు. కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి.. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రతీ సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది లేట్ గా పాఠశాలలు ప్రారంభమైనవి కాబట్టి మే 27 నుంచి హాలిడేస్ ప్రకటించాలని ముందే అనుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
కానీసెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో నైట్ కర్ఫ్యూ మొదలైంది. భయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ కారణంగాపాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్లతో పాటు టీచర్లకు కూడా సెలవులు ప్రకటించాలని టీచర్ యూనియన్ల నుంచి ఒత్తిడి రావడంతో ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
దానికి తోడు 1 నుంచి 9 తరగతి విద్యార్థులను ప్రమోట్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. పాఠశాలలకు విద్యార్థుల రాకున్నా టీచర్లు మాత్రం వెళ్తున్నారు. దాదాపు నెలరోజులుగా వారంతా ఖాళీగానే ఉంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, డీటీఎఫ్, తపస్తో పాటు పలు సంఘాలు టీచర్లకూ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కొన్నిసంఘాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్టు నేతలు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)