TS School Reopening: పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం... హైకోర్టుకు వివరణ
TS School Reopening: పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం... హైకోర్టుకు వివరణ
TS School Reopening | తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు... జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి.
1/ 7
1. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ అంశంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాఠశాలలు తెరిస్తే విద్యార్థులు కోవిడ్ 19 గైడ్లైన్స్ పాటించే అవకాశాలు ఉంటాయా అన్న అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. పాఠశాలలు తెరిస్తే అన్ని తరగతుల విద్యార్థులు హాజరుకావాలా? భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తెలంగాణ విద్యా శాఖ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. పాఠశాలలు తిరిగి ప్రారంభించే అంశంపై మూడు రోజుల్లో గైడ్లైన్స్ రూపొందిస్తామని విద్యా శాఖ తెలిపింది. అంతేకాదు... విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాల్సిన అవసరం లేదని విద్యా శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయని, విద్యార్థులు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చని, విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని విద్యా శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై వారం రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తామని విద్యా శాఖ హైకోర్టుకు వివరించింది. అయితే పాఠశాలలు ప్రారంభించడంపై విద్యా శాఖ పునరాలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని నిర్ణయించిన విద్యా శాఖ... పాఠశాలలు, జూనియర్ కళాశాలల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. మరోవైపు తెలంగాణ విద్యా శాఖ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగే ఈ సమావేశంలో విద్యాసంస్థల ప్రారంభంపై విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)