1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 5369 పోస్టుల్ని ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి వివరాలు డిస్ప్లేలో కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు. ఆ తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)